పసిడి ధర పరుగులు పెడుతుంది.. అల్ టీం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే దూసుకుపోతుంది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.220 పైకి కదిలింది. దీంతో ధర రూ.56,810కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.52,080కు పెరిగింది. అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది.
కేజీ వెండి ధర రూ.350 తగ్గడంతో… ధర రూ.65,050కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. రూ.52,550కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.100 పెరుగుదలతో రూ.53,750కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.350 తగ్గుదలతో రూ.65,050కు చేరింది.