భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. 20 లక్షల దిశగా కరోనా కేసులు వెళ్తున్నాయి. ప్రతీ రోజు కూడా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గాని ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కేసులు పెరగడం అది కూడా ఆరు రోజుల్లో మూడు లక్షలకు పైగా కేసులు రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా రికవరీ రేటు భారీగా పెరుగుతుంది.
కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 12,30,509 కు చేరింది. ప్రస్తుతానికి, దేశంలో 5, 86,298 క్రియాశీల కేసులు ఉన్నాయి. రికవరీ రేటు ప్రస్తుతం 66.31% వద్ద ఉంది. యాక్టివ్ కేసులు దేశంలో తగ్గుముఖం పట్టాయి. ఈ కేసులు ఇంకా తగ్గాలి అని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం మరణాలు కూడా చాలా వరకు తక్కువగానే ఉన్నాయి దేశంలో. మరణాలను తగ్గించడంపై కేంద్రం దృష్టి పెట్టింది.