కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (21-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌‌వారం (21-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 21st august 2020

1. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కార‌ణంగా ఒక్క రోజే 339 మంది చ‌నిపోయారు. కొత్త‌గా 14,161 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,57,450కు చేరుకుంది. 4,70,873 మంది కోలుకున్నారు. 1,65,562 మంది చికిత్స పొందుతున్నారు.

2. కోవిడ్ బారిన ప‌డిన తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1 కోటి 4 ల‌క్ష‌ల 40వేల ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌ని రాష్ట్ర మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ తెలిపారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆ మొత్తాన్ని ఖ‌ర్చు చేశామ‌న్నారు.

3. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ ఇండ్ల‌లోనే వినాయ‌క చ‌వితి పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు అంద‌రూ మ‌ట్టితో త‌యారు చేసిన గ‌ణ‌నాథుల‌నే పూజించాల‌న్నారు.

4. బీహార్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా క‌రోనాను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించి విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా నామినేష‌న్లు వేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

5. ఏపీలో కొత్త‌గా 9544 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,34,940కు చేరుకుంది. 87,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,44,045 మంది రిక‌వ‌రీ అయ్యారు. 3,092 మంది చ‌నిపోయారు.

6. దేశంలో కొత్త‌గా 62,282 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 29,10,032కు చేరుకుంది. 55,002 మంది చ‌నిపోయారు. 21,60,059 మంది కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీ రేటు 74.28 శాతానికి చేరుకుంది.

7. తెలంగాణ‌లో కొత్త‌గా 1967 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 99,391కు చేరుకుంది. 21,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 76,967 మంది కోలుకున్నారు. 737 మంది చ‌నిపోయారు.

8. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,995 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,67,430కు చేరుకుంది. 53,413 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,07,677 మంది కోలుకున్నారు. 6,340 మంది చ‌నిపోయారు.

9. క‌రోనా క‌ట్ట‌డికి హ‌ర్యానా ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. శ‌ని, ఆది వారాల్లో ఇక‌పై కేవ‌లం నిత్యావ‌స‌రాల‌ను విక్ర‌యించే దుకాణాలు మాత్ర‌మే తెరిచి ఉంటాయి. ఇత‌ర అన్ని షాపులు, కార్యాల‌యాల‌ను మూసివేస్తారు.

10. చైనాకు చెందిన సినోఫార్మా అనే కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్‌ను త‌యారు చేసి 3వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్టింది. ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ఒక్క డోసును రూ.10,791కి అందుబాటులోకి తేనున్నారు. అదే జ‌రిగితే అత్యంత ఖ‌రీదైన వ్యాక్సిన్‌గా ఆ వ్యాక్సిన్ నిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news