అధికారంలోకి వస్తే ‘హైదరాబాద్’ పేరు మారుస్తాం…

-

తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మారుస్తామని భాజపా నేత రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….  ఒకప్పుడు భాగ్యనగరంగా పేరొందిన నగరానికి 16వ శతాబ్దంలోని కుతుబ్ షాహీ హైదరాబాద్‌గా పేరు మార్చారని వివరించారు. నాడు ఎంతో మంది హిందువులపై దాడులు చేయడంతో పాటు పురాతన ఆలయాలను ధ్వంసం చేశారన్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భాగ్యనగరంలో అభివృద్ధి పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. గతంలో అలహాబాద్ తరహాలోనే హైదరాబాద్ పేరు తో పాటు రాష్ట్రంలోని  సికింద్రాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల పేర్లను మార్చి దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన ప్రముఖుల పేర్లు పెడతామన్నారు.  రాష్ట్రంలోని  ఇలాంటి పేర్లను మార్చడం తమ రెండో లక్ష్యమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news