ఐశ్వర్యారాయ్ తో విడాకులేంది.. అసలు ఏంది వ్యవహారం అంటారా? మన తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నాడు కదా. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు. మొన్ననే పెళ్లి అయింది కదా తేజ్ కు. ఐశ్వర్యారాయ్ అనే యువతితో మనోడి పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. కానీ.. పెళ్లయిన కొన్ని రోజులకే వాళ్లిద్దరికీ చెడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. కానీ.. తేజ్ కుటుంబ సభ్యులు మాత్రం విడాకులకు అస్సలు ఒప్పుకోవడం లేదు.
దీంతో తేజ్ ప్రతాప్ యాదవ్.. ఐశ్వర్యతో కలిసి ఉండలేనని.. తనకు విడాకులు ఇప్పిస్తేనే తిరిగి ఇంటికి వస్తానని చెప్పి హరిద్వార్ కు వెళ్లిపోయాడు. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు కూడా పెట్టుకున్నాడు తేజ్. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఈ విషయం తలనొప్పిగా మారింది. ఐశ్వర్యారాయ్ ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కూతురు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగ ప్రసాద్ రాయ్ మనవరాలు. వాళ్లు పెళ్లి గత మే 12 న జరిగింది.