భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ అరుదైన ఘనత

-

భూమికి 9.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతినీలలోహిత కాంతిని గుర్తించింది భారతదేశ మొట్ట మొదటి బహుళ-తరంగదైర్ఘ్య ఉపగ్రహం ఆస్ట్రోసాట్. ఈ మేరకు పుణెలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్​ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్​(ఐయూసీఏఏ) విభాగం ప్రకటన విడుదల చేసింది. ఈ పరిశోధనలో పాల్గొన్న అంతర్జాతీయ బృందానికి భారత శాస్త్రవేత్త డా.కనక్​ సాహ నేతృత్వం వహించారు. ఈ బృందంలో ఫ్రాన్స్​, స్విట్జర్లాండ్​, జపాన్​, అమెరికా, నెదర్లాండ్స్​ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘నేచర్​ ఆస్ట్రానమీ’ జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

ఆ ఆస్ట్రోనాట్​ ఉపగ్రహం ఐదు ప్రత్యేకమైన ఎక్స్‌రే, అతినీలలోహిత టెలిస్కోప్‌లను కలిగి ఉంటుంది. ఈ పరిశీలన 2016లో 28 గంటలపాటు జరిగినప్పటికీ పాలపుంత నుంచే అతినీల లోహిత కాంతి వెలువడిందా? అని విశ్లేషించేందుకు ఇంత సమయం పట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కాంతిని గతంలో నాసాకు చెందిన హబుల్​ స్పేస్​ టెలిస్కోప్ గుర్తించలేకపోయిందని చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలను తమ ఆవిష్కరణ నిజమని ఒప్పించడం కొంచెం కష్టమేన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news