జ‌గ్గారెడ్డి బాధేందో సూడుండి సారూ!

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవ్వ‌రికీ అర్థం కాని నేత ఎవ్వ‌రైనా వున్నారంటే ఆయ‌న తూర్పు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి మాత్ర‌మే. జ‌‌గ్గారెడ్డిగా పాపుల‌ర్ అయిన ఆయ‌న గ‌త కొంత కాలంగా చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఓసారి అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్య‌లు చేస్తే మ‌రో సారి మాసారు మంచోరు అంటూ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ప‌నితీరు భేష్ అని సొంత పార్టీ నేత‌ల‌కే షాకిచ్చారు.

హ‌రీష్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూనే సింగూరు జ‌లాల‌ని సంగ‌రెడ్డి ప్ర‌జ‌ల‌కు కాకుండా త‌ర‌లించుకుపోతున్నార‌ని ఈ విష‌యంలో హ‌రీష్ రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన జ‌గ్గారెడ్డి తాజాగా కొత్త స్వ‌రం అందుకున్నారు. కేసీఆర్ త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుంటే ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముందు ధ‌ర్నా చేస్తానంటూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. త‌న‌ని క‌లిసేందుకు అవ‌కాశం ఇచ్చే వ‌ర‌కు ధర్నా చేస్తూనే వుంటాన‌ని జగ్గారెడ్డి స్వ‌రం పెంచారు.

ఇంత‌కీ జ‌గ్గారెడ్డి సీఎం అపాయింట్‌మెంట్ కోరుతున్న‌ది సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని వివ‌రించ‌డానికా లేక త‌న పొలిటిక‌ల్ కెరీర్‌, రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మేనా? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్ వ‌ర్గాల్లో మాత్రం జ‌గ్గారెడ్డి తీరు ఎంత‌కీ అంతుచిక్క‌డం లేద‌ట‌. అయితే ఇదంతా గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం జ‌గ్గారెడ్డి తీరుకు తెగ న‌వ్వుకుంటూనే ఆయ‌న బాధేందో జ‌ర సూడుండి సారూ అని కేసీఆర్‌ని కోరుతున్నార‌ట‌. భ‌లే చిత్రంగా వుంది క‌దూ జ‌గ్గారెడ్డి వింత క‌థ‌.

Read more RELATED
Recommended to you

Latest news