శేఖర్ మాస్టర్ చేసిన పనికి సెల్యూట్ కొట్టాల్సిందే..!

-

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలన్నీ చేస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి అదుపులోకి రావటం లేదు. కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చెయ్యటం వల్ల కరోనా రోగులను కాపాడవచ్చని డాక్టర్లు తెలియజేశారు. కరోనా నుంచి కోలుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధులు ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా.. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేశారు.

ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గత నెలలో తనకు కరోనా సోకగా కిమ్స్‌ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు తన శరీరంలో యాంటీ బాడీస్ పెరిగినందున ప్లాస్మాను డొనేట్ చేసినట్లు చెప్పారు. వైద్యుల సమక్షంలో 400 మి.లీ ప్లాస్మాను డొనేట్ చేశానని.. కరోనా నుంచి కోలుకున్నవారు విధిగా ప్లాస్మాదానం చేయాలనీ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news