ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అంశంపై ఇపుడు తీవ్ర స్థాయిలో ఆందోళన ఉంది. వైసీపీ సాధిస్తుందా లేదా అనేది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసిపి పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది. అంతే కాకుండా కరోనా మహమ్మారి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వ సాయం…
దీంతో పాటుగా ప్రత్యేక హోదా ఇతర సమస్యలు మెరిట్ స్టేషన్ లోకి వస్తాయని వైసిపి తన ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్దియే) ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో జరిగిన అవకతవకలపై పార్లమెంట్లో ప్రస్తావన తీసుకు వస్తారని వైసీపి ప్రకటించింది. కాగా పార్లమెంట్ సమావేశాలు 18 రోజులు జరగనున్నాయి.