సమాచార వ్యవస్థకు ఊతమిచ్చే జీశాట్-29 భారీ ఉపగ్రహాన్ని జీఎస్ ఎల్వీ-మార్క్3 డీ2 రాకెట్ ద్వారా రోదసిలోకి పంపారు. రాకెట్ బరువు 640 టన్నులు కాగా, ఉపగ్రహం బరువు 3,423 కిలోలు. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళుతోంది. అంతా సవ్యంగా ఉంటే.. 16.43 నిమిషాలలో భూమికి 207కి.మీ. ఎత్తుకు చేరుకుని జీశాట్-29 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది.
ఇవీ ఉపయోగాలు!
జమ్ము-కశ్మీర్, ఉత్తర, ఈశాన్య భారత భూ భాగాలలో ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ ప్రసారాలకు ఊతం ఇస్తుంది. మొత్తం పదేళ్లపాటు ఉపగ్రహం పనిచేసేలా రూపొందించారు. బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందించాయి.