తిరుమలలో మంత్రి కొడాలి నాని మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదన్న ఆయన స్వామి వారి పై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారని అన్నారు. అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో వుందో బహిర్గతం చెయ్యాలని ఆయన కోరారు. జగన్ హిందూ దేవాలయంకు వచ్చినప్పుడు హిందువులా చర్చ్ కు వచ్చిన సమయంలో క్రైస్తవుడిలా మసీదుకు వచ్చిన సమయంలో నవాబ్ లా వుంటున్నాడని ఆయన అన్నారు.
శ్రీ వారి దయవల్లే జగన్ సియం అయ్యారన్న ఆయన పట్టు వస్త్రాలు సమర్పించేందుకు టీటీడీనే సీఎం ను ఆహ్వానిస్తే డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలని అన్నారు. బీజేపీ క్రింద స్థాయి నాయకుల వైఖరి వల్ల మోడీ గారిని బజారున పడేస్తున్నారన్న ఆయన ముందు నరేంద్ర మోడీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పండి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాక సోము వీర్రాజు ఏపీ బిజేపి అధ్యక్షుడు అయిన తరువాతే ఆలయాల పై దాడులు పెరిగాయని ఆయన అన్నారు.