కరోనా రికవరీల్లో రోజుకో రికార్డు సృష్టిస్తోన్న ఇండియా !

-

కరోనా రికవరీల్లో ఇండియా రోజుకో రికార్డు సృష్టిస్తోంది. కరోనా రికవరీలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. అదీ కాక ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలోనే రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం.

గత ఐదు రోజులుగా రోజు వారీగా కొవిడ్‌ కేసుల నమోదు కంటే కోలుకున్న వారి సంఖ్యే అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టంబర్‌ 19న 93,337 కొత్త కేసులు నమోదు కాగా ఆ రోజు కోలుకున్న వారి సంఖ్య 95, 880గా ఉంది. ఇక మరుసటి రోజు కొత్త కేసులు 95,605 గా ఉంటే ఆ రోజు కోలుకున్న వారి సంఖ్య 94, 612గా నమోదైంది. 21న కొత్త కేసుల సంఖ్య 86, 961గా ఉండగా కోలుకున్న వారి సంఖ్య 93, 356 గా నమోదయింది. సెప్టెంబర్‌ 22న కొత్తగా 75,083 కేసులు నమోదు కాగా.. లక్ష మందికి పైగా కోలుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news