హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్…!

-

హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హేమంత్ కేసులో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తుంది అతని భార్య అవంతి. సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి పేర్కొంది. గతంలో హేమంత్ తండ్రితో బెదిరింపులకు దిగాడు సందీప్ రెడ్డి. నా దగ్గర రెండు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అంటూ నెల రోజులు క్రితం బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆమె ఆరోపించింది.

హేమంత్ కిడ్నాప్ అయిన రోజు సందీప్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు గచ్చి బౌలి పోలీసులు. సందీప్ రెడ్డి నుండి నాకు ప్రాణ హాని ఉందని అవంతి ఆరోపిస్తుంది. కాగా ఈ కేసులో మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేయనున్నారు అని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news