షియోమీ నుంచి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5.. ధర కేవ‌లం రూ.2499 మాత్ర‌మే..

-

షియోమీ కంపెనీ నూత‌నంగా ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 పేరిట ఓ స్మార్ట్ బ్యాండ్‌ను భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 1.1 ఇంచుల అమోలెడ్ క‌ల‌ర్ ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 11 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్ కూడా ఉంది. 24 అవ‌ర్ స్లీప్ మానిట‌రింగ్ ఫీచ‌ర్ ను ఇందులో అందిస్తున్నారు.

Mi Smart Band 5 launched in india

స్ట్రెస్ మానిట‌రింగ్‌, బ్రీతింగ్ ట్రెయినింగ్‌, ప‌ర్స‌న‌ల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్‌, మెన్‌స్ట్రువ‌ల్ సైకిల్ ప్రిడిక్ష‌న్ ఫీచ‌ర్‌, ఫోన్ కెమెరా ష‌ట‌ర్‌, 2 వారాల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. స్టెప్స్ కౌంట‌ర్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, యాక్టివిటీ ట్రాక‌ర్‌, వెద‌ర్ ఫోర్ క్యాస్ట్‌, యాప్ నోటిఫికేష‌న్స్‌, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ బ్యాండ్‌ను ఇత‌ర డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.

ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5 బ్లాక్ క‌లర్ ఆప్ష‌న్‌లోనే విడుద‌లైంది. దీని ధ‌ర రూ.2499 గా ఉంది. అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో అక్టోబ‌ర్ 1 నుంచి విక్ర‌యిస్తారు. ఎంఐ హోం స్టోర్‌, రిటెయిల్ స్టోర్‌ల‌లో త‌రువాత ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news