మస్ట్ రీడ్: అవంతి తండ్రి అజ్ఞానంపై నెటిజన్ల కామెంట్ ఇది!

-

కొందరు ఆడపిల్లల తల్లితండ్రులు వారి చేతకానితనాన్ని, వారి పెంపకంలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి “పరువు” అనే మాటను అడ్డుపెట్టుకుంటున్నారు! అత్యంత కృరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలను పెంచడం రాకపోతే కనడం మానెయ్యాలి.. వారి ఇష్టాలకు అభిప్రాయాలకు అనుగుణంగా పెంచుకోవాలి.. లేదా వారి పిల్లల అభిప్రాయాలకు, ఇష్టాలకు విలువివ్వాలి! అవన్నీ చేయలేని చేతకాని తల్లితండ్రులు కొందరు… మిగిలిన వారి బిడ్డలపై పడుతున్నారు!

తమ ఇంటి ఆడపిల్లను, మైనర్ బాలికనో కిడ్నాప్ చేస్తే తప్పు! తమ ఇంటి ఆడబిడ్డను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే తప్పు! తమ ఇంటి ఆడపిల్లను అల్లరిచేస్తే తప్పు! అలా కాకుండా… కనిపెంచిన తల్లితండ్రులకంటే తనకు ఒక అబ్బాయి ఇష్టమని, తాను లేకుండా బ్రతకలేను అని, తల్లితండ్రులను పక్కనపెట్టి, తాను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఒక మేజర్ అయిన అమ్మాయి విషయంలో స్పందిస్తే.. తమ చేతకాని పెంపకం ఎక్కడ బయటపడుతుందో అని.. ఆ అబ్బాయిపై పరువు పేరుచెప్పి పడుతున్నారు కొందరు తల్లితండ్రులు!

తమ ఇంటి ఆడపిల్ల ప్రేమ విషయం తెలుసుకున్న అసలు తల్లితండ్రులు ఏమి చేయాలి? తమకు ఇష్టంలేదని చెప్పుకోవాలి.. ఎందుకు ఇష్టపడిందో కనుకోవాలి.. అందులో ఉన్న కష్టసుఖాలు అర్ధం అయ్యేలా చెప్పాలి.. అప్పటికీ మేజర్ అయిన ఆమె ఒప్పుకోకపోతే.? ఓపిక ఉంటే వారే ఒప్పుకోవాలి.. మనసంగీకరిస్తే మాట్లాడాలి.. కూతురు కావాలనిపిస్తే కలుపుకుపోవాలి.. అంతే కాని, తన కూతురు కావాలనుకున్న వాడిని హత్య చేయడం ఏమిటి? వీడి కూతురు ప్రేమించిన పాపానికి వీడి కూతురుని ప్రేమించిన పాపానికి… అన్యంపుణ్యం ఎరుగుగని అమాయకులైన తల్లితండ్రులకు అందొచ్చిన కొడుకులను పొట్టనపెట్టుకోవడాన్ని ఏమనాలి?

కొందరు తల్లితండ్రులకు పిల్లలను పెంచడం రాదు… తల్లితండ్రులే తనకు ముఖ్యం అనే ఆలోచన ఆ బిడ్డకు కలిగేలా ప్రేమించడం రాదు… డబ్బు మధంతోనో, లేక ఆడపిల్ల అన్న చులకనభావంతోనో వారిని ప్రేమించరు, సరికదా పెత్తనం చేస్తారు.. కండిషన్స్ పెడతారు! ప్రేమించడానికి పెత్తనం చేయడానికి ఉన్న పెంపకంలో తేడా వారికి ఈ జన్మకు అర్ధం కాదు! మద్యలో వారి కుల్లుబోతుతనానికి పరువు అని పేరు తగిలించి తమ కూతురి తాళిబొట్లు తెంచేస్తారు.. ఆ అబ్బాయిని కన్నవారికి జన్మకు సరిపడా కన్నీటిని మిగులుస్తున్నారు!

తాజాగా హేమంత్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన అవంతి తండ్రి లక్ష్మారెడ్డిని చర్లపల్లి జైలునుంచి కస్టడీకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన లక్ష్మారెడ్డి… తన పరువు తీశాడన్న కారణంగానే హేమంత్ ని హత్య చేయాల్సి వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తుంది! ఇక్కడ అజ్ఞానంతో నిండిపోయిన లక్ష్మారెడ్డి బుర్రకు అర్ధం కావాల్సింది అది కాదు… ఆయనకు నిజంగా పరువు ఉంటే అది తీసింది హేమంత్ కాదు… “ఆయన పెంపకం” అయ్యి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!! నామాటే నెరవేరాలి.. లేదంటే చంపేయాలి అన్న రేంజ్ లో లక్ష్మారెడ్డి వేరేవాళ్ల కుమారుడి విషయంలో ఆలోచించాడంటే… ఇంక కూతురిని తనకున్న శాడిజంతో, ఈగోతో, అహంభవంతో, అహంకారంతో ఎంత బానిసలా పెంచి ఉంటాడో అని అంటున్నారు!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news