పోస్టాఫీస్ లో సేవింగ్స్ సులభతరం.. పీపీఎఫ్, ఎస్ఎస్ వై స్కీంలకు వర్తింపు.. !

-

డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సులభతరం చేసింది. దీంతో ఇకపై కస్టమర్లు సులభంగా డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) వంటి స్కీమ్స్‌లలో డబ్బులు దాచుకోవడం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది.

post office
post office

పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం పోస్టాఫీస్ గ్రామీణ్ డాక్ సేవక్ బ్రాంచుల్లో చెక్కు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో డిపాజిట్లు, అకౌంట్స్‌ను విత్‌డ్రా ఫామ్ (ఎస్‌బీ-7)తోనే తెరిచే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ నిర్ణయంతో ఇకపై సేవింగ్స్ పాస్‌బుక్, విత్‌డ్రా ఫాం కలిపి అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త ఖాతాను తెరుచుకొవచ్చు. గ్రామీణ్ డాక్ సేవక్ బ్రాంచుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

పోస్టాఫీసుల ద్వారా ఈ స్కీంలో రూ.5,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. కొత్త పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెనింగ్‌కు కూడా ఇది వర్తిస్తుందన్నారు. అయితే రూ.5,000 వరకే లిమిట్ ఉంటుందని తెలిపారు. అదే రూ.5,000కుపైన డిపాజిట్లకు పోస్టాఫీస్ సేవింగ్స్ బుక్ అందించాల్సి ఉంటుంది. పే ఇన్ స్లిప్ కూడా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే డబ్బులు సులభంగా పీపీఎఫ్ లేదా ఎస్ఎస్ వైలో డబ్బుల డిపాజిట్ చేసుకోవచ్చు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం వారం రోజుల కిందటే ప్రతిపాదనను వెల్లడించింది. చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే ఈ పథకాల ద్వారా వడ్డీ రేట్లను పొందవచ్చన్నారు. ఒక వేళ డబ్బులు స్థిరంగా కొనసాగినా ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ మేరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని కేంద్రం ప్రకటించింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఉన్న వారికి గత త్రైమాసిక వడ్డీ రేట్లే కొనసాగుతాయన్నారు. డిసెంబర్ 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది. దీంతో సులభంగా ఖాతాను తెరుచుకుని డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news