ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని బహిరంగంగా మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్పబోతున్నారు! అందులో భాగంగా విజయవాడ, గుంటూరుల్లో సామూహిక దీక్ష చేయ నిర్ణయించింది జనసేన!
అవును… ఉత్తరాంధ్ర – రాయలసీమ సంగతి పక్కనపెట్టండి.. ఏపీ రాజధానిని మాత్రం అమరావతిలోనే ఉంచండి అంటూ నినదిస్తుంది జనసేన! అమరావతిలోనే రాజధాని ఉంటుంది కానీ… ఆ గౌరవం, ఆ అభివృద్ధి, ఆ హోదా.. సీమకు, ఉత్తరాంధ్రకు కూడా ఇద్దామని జగన్ ఎంత చెప్పినా, మరెంత ప్రయత్నించినా.. తాము ఒప్పుకునే పరిస్థితి లేదని, అది జగన్ వల్ల కాదని బలంగా చెబుతుంది జనసేన!
అందులో భాగంగా తాజాగా స్పందించిన జనసేన… అమరావతి రైతుల త్యాగాన్ని జనసేన అర్ధంచేసుకున్నట్లే, ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలని చెప్పుకొస్తుంది. “నేడు ఏపీ ఆర్థికంగా ఇబ్బంది పడటానికి దేశం మొత్తానికి కరోనా కారణం కాఒచ్చేమో కానీ… ఏపీలో మాత్రం అమరావతి అభివృద్ధి నిలుపుదల చేయడమే కారణం” అని బలంగా చెబుతుంది జనసేన! ఫలితంగా అమరావతికి మద్దతుగా 12న విజయవాడ, గుంటూరులో సామూహిక దీక్ష చేయనుంది జనసేన పార్టీ!
-CH Raja