ఏపీలో పరిపాలన విషయంలో జగన్ కు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్న సంగతి తెలిసిందే. జగన్ ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలోనే ప్రధాని మోడీ అభినందించడంతో పాటు.. దేశంలోని మిగతా గ్రామాలు కూడా ఈ విషయంలో జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నంత రేంజ్ లో ప్రశంసించారు! ఇదే క్రమంలో తాజాగా జగన్ ఖాతాలో తన స్వహస్తలతో ఒక రికార్డు వేశారు మోడీ!
అవును… ఏపీ ముఖ్యమంత్రి జగన్ – ప్రధాని నరేంద్ర మోదీల సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సంగతి తెలిసిందే. అయితే… ఇప్పటివరకూ ప్రధాని మోడీ.. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ నేరుగా సమావేశమయింది లేదు. కరోనా తర్వాత తొలిసారి మోడీ.. ఇప్పటివరకూ కేవలం జగన్ తో మాత్రమే ముఖాముఖి సమావేశం అయ్యారు! ఇది మోడీ దగ్గర – జాతీయస్థాయిలో జగన్ ను ఉన్న క్రెడిట్ & క్రెడిబిలిటీ!!
సాధారణంగా ఈ కరోనా కాలమంతా మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు! అయితే కరోనా తర్వాత తొలిసారి జగన్ తో మోడీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే… జగన్ ప్రతిపాదించిన మెజారిటీ అంశాలకు, సమస్యలకూ ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది! దీంతో ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చిన జగన్ ఉల్లాసంగా ఉత్సాహంగా కన్పించారు.
-CH Raja