తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వాన గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఈరోజు నుంచి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాన్నాయి. దీంతో తీరం వెంబడి భీకర గాలులు వీస్తాయని మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
24 గంటల్లో వాయుగుండంగా బలపడి.. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సోమవారం ఉదయం తీరం దాటే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తామని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.