“మళ్లీ మీరే రావాలి”… ఏపీలో కొత్త సర్వే సంచలన విషయాలు!

-

2019 ఎన్నికల్లో టీడీపీ నినాదం.. “మళ్లీ మీరే రావాలి” అని! ఇక వైకాపా నినాదం.. “రావాలి జగన్ – కావాలి జగన్” అని! అయితే ఏపీ వాసులు మాత్రం ఆ ఎన్నికల్లో “జగన్ రావాలి” అనుకున్నారు.. ఫలితాలు ఊహలకందకుండా ఇచ్చారు.. తమ్ముళ్లకు దిమ్మ తిరిగేలా అందించారు! అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ వాసులు ఏమనుకుంటున్నారనే విషయాలపై తాజాగా నిర్వహించిన ఒక సర్వే సంచనల విషయాలు వెల్లడించింది.

వీడీపీ అసోసియేట్స్ ఆర్ అండ్ డీ విభాగం వారు తాజాగా చేసిన ఒక సర్వేలో వైకాపాకు మూడుశాతం ఓట్లు పెరిగాయి! అవును… గత ఏడాది ఫలితాల్లో వైకాపాకు 50 శాతం ఓట్లు వస్తే ఇపుడు సర్వేలో 53 శాతం ఓట్లు వచ్చాయి! ఏడాదిన్నర కాలంగా జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఇది ప్రజలు ఇచ్చిన బహుమతిగా చెబుతున్నారు విశ్లేషకులు! ఫలితంగా… “మళ్లీ మీరే రావాలి జగన్ – మళ్లీ మీరే కావాలి జగన్” అంటున్నారు ఏపీ వాసులు!

ఇక టీడీపీ విషయానికొస్తే… చంద్రబాబు సీఎంగా రావాలని 40 శాతం ఓటర్లు కోరుకున్నారని చెబుతుంది ఈ సర్వే! ఇక ఏపీలో బీజేపీ – జనసేన కూటమి విషయానికొస్తే… వారు చేస్తున్న హడావిడికి ప్రజలనుంచి స్పందన కరువవ్వుతుందని చెబుతుంది ఈ సర్వే! ప్రస్తుతానికి ఈ సర్వే లెక్కల ప్రకారం చూసుకుంటే… మళ్లీ జగనే ఏపీకి సీఎం కాగా, చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోనున్నారన్నమాట! ఇక కలలు కంటున్న బీజేపీ – జనసేన కూటముల ప్రభావం ప్రస్తుతానికి శూన్యం అన్నమాట!

Read more RELATED
Recommended to you

Latest news