అక్రమ సంబంధం మోజులో భర్తని చంపేసే పాత్రలో మిల్కీబ్యూటీ…!

-

హీరోయిన్‌గా సూపర్ సక్సెస్‌లు ఉంటేనే కెరీర్‌కి గ్యారెంటీ ఉండట్లేదు. అలాంటిది నెగటివ్‌ రోల్‌ వైపు వెళ్తే కెరీర్‌ ఉంటుందా.. మరి బోల్డ్‌ విలన్‌గా కనిపించబోతోన్న తమన్న పరిస్థితి ఏంటి? తెలుగు అంధాదున్‌ మిల్కీకి ప్లస్‌ అవుతుందా.. మైనస్‌ అవుతుందా? తమన్నా కెరీర్‌ స్లో ఫేజ్‌లోకి వెళ్లిపోయి చాలా రోజులవుతోంది. ఈమెకి స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ వస్తున్నాయి గానీ హీరోయిన్ రోల్స్ మాత్రం రాట్లేదు. ఇలాంటి టైమ్‌లోనే ‘అంధాదున్’ రీమేక్‌కి సైన్‌ చేసింది తమన్న.

హిందీలో టబు ప్లే చేసిన క్యారెక్టర్‌ని ఇక్కడ తమన్నా రీప్లేస్ చేస్తోంది. అయితే ఈ క్యారెక్టర్‌కి అక్రమ సంబంధం ఉంటుంది. ఈ సంబంధం కోసం భర్తని కూడా చంపేస్తుంది. హత్యని చూసిన హీరోని కూడా చంపాలనుకుంటోంది. ఇలాంటి క్యారెక్టర్‌ తమన్న కెరీర్‌కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే మిక్స్‌డ్ ఆన్సర్స్‌ ఇస్తున్నారు సినీజనాలు.
‘అంధాదున్‌’ రీమేక్‌లో తమన్నాది పెర్ఫామెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్. సో నెగటివ్‌ రోల్‌తో మిల్కీలోని ఆర్టిస్ట్‌ సాటిస్‌ఫై అవ్వొచ్చు. అయితే విలన్‌గా చేశాక మళ్లీ తమన్నాకి హీరోయిన్‌ రోల్స్‌ రావడం కష్టమే.. కాబట్టి తమన్నాకి కొంచెం కష్టమే అంటున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news