2014 నుంచి 2019 వరకు ఏపీకి ఒక స్వర్ణ యుగం అని విజయవాడ ఎంపీ కేశినేని నానీ వ్యాఖ్యానించారు. విభజన తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని ఆయన అన్నారు. కియా మోటార్స్, హీరో మోటార్ సైకిల్ ఫ్యాక్టరీలు, విశాఖ ఫైనాన్షియల్ హబ్ తో సహా, అనేక ఇతర ప్రాజెక్టులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని ఆయన మండిపడ్డారు. టిడిపి తీసుకువచ్చిన ప్రాజెక్టులకు ఇప్పటి ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిందని తెలిపారు.
తట్ట ఇసుక బస్తా, సిమెంట్ తో ఒక్క కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయలేదన్న ఆయన… నా అభ్యర్థన మేరకు 6 వేల కోట్ల రూపాయల పనులను కేటాయించారని ఆయన అన్నారు. గడ్కరీకి నేను, విజయవాడ ప్రజలు రుణపడి ఉంటాం అని పేర్కొన్నారు. బస్ స్టాండ్ కన్నా హీనంగా ఉన్న విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి టిడిపి ప్రభుత్వం తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. సొంత ప్రయోజనాలు, స్వార్ధం కోసం వ్యవస్థలపై దాడి చేస్తున్నారు అని మండిపడ్డారు.