ముహూర్తం పెట్టేసిన జగన్…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజధాని అంశం అనేది కాస్త హాట్ టాపిక్ గా ఉంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడంలో ఎక్కడా కూడా ఆగే పరిస్థితి లేదు. సిఎం జగన్ కూడా రాజధాని విషయంలో కేంద్రానికి కూడా ఒక స్పష్టత ఇచ్చారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ… విశాఖ పరిపాలనా రాజధాని చేస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు రాజధాని విషయంలో ఏపీ సర్కార్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే భావన వ్యక్తమవుతుంది.

అసలు రాజధాని విషయంలో ఆయన ఎలా ముందుకు వెళ్తారు అనేది పరిశీలిస్తే… సిఎం ఎక్కడ ఉంటే అక్కడే క్యాంప్ ఆఫీస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి జగన్ విశాఖ నుంచి పరిపాలించడానికి రెడీ అయ్యారు. ఏ శాఖలను తరలించకుండా హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్ళాలి అని, ఈ లోపు దసరా రోజు నుంచి విశాఖలో పరిపాలన మొదలు పెడితే మంచిది అనే భావన జగన్ లో ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా విమర్శలు వచ్చినా సరే జగన్ మాత్రం వెనక్కు తగ్గే అవకాశం లేదు.

రాజధాని ఎక్కడ ఉన్నా సరే సిఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చు. గతంలో సిఎంలు ఇలాగే పని చేసిన సందర్భాలు ఉన్నాయి. ఊటిలో జయలలిత, ప్రకృతి కేంద్రం నుంచి సిద్దరామయ్య, విశాఖ నుంచి బస్సులో చంద్రబాబు నాయుడు పరిపాలించారు. అప్పుడు ఏ విధంగా కూడా ఇబ్బందులు న్యాయ స్థానాల నుంచి రాలేదు. కాబట్టి ఇప్పుడు జగన్ ఇలా ప్లాన్ చేయడానికి రెడీ అయ్యారు. అధికారులు కూడా ఇప్పుడు సిఎం క్యాంప్ ఆఫీస్ కోసం స్థలం వెతికే పనిలో ఉన్నారని సమాచారం.

ఒక ఆఫీసుని లీజుకి తీసుకోవడానికి ప్లాన్ చేసారు. త్వరలోనే దీనిపై ఏపీ సర్కార్ ఒక అధికారిక్ ప్రకటన చేయనుంది. సిఎస్ నీలం సహాని కూడా విశాఖ వెళ్ళే అవకాశం ఉండవచ్చు. మంత్రులు కొందరు విశాఖలోనే ఉండాలి అని భావిస్తున్నారు. ఇవి ఎంత వరకు ఫలిస్తాయి అనేది త్వరలోనే ఒక స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news