బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడంలో భారత్ రోజుకొక ఘనత సాధిస్తుంది..గత రెండు రోజుల్లోనే రెండు క్షిపణులు విజయవంతంగా పరీక్షించి తన సత్తా చాటుతుంది భారత్..తాజాగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇండియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణిని ఐఎన్ఎస్ చెన్నైలోని నావల్ డిస్ట్రాయర్ నుండి విజయవంతంగా పరీక్షించింది..అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది..బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి నౌకాదళం ద్వారా సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను చేధించడం ద్వారా యుద్ధనౌక యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుందని డీఆర్డీవో తెలిపింది.