హాలీవుడ్ టెక్నిషియన్స్ తో ఇండియన్-2

-

ఓ పక్క 2.ఓ రిలీజ్ కు అవుతుండగా శంకర్ తాను చేయబోతున్న ఇండియన్-2 మూవీకి సంబందించిన విషయాలను చూస్తున్నారు. 2.ఓ నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ లోనే ఇండియన్-2 మూవీ తెరకెక్కుతుంది. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఇండియన్-2 రాబోతుంది.

ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నిషియన్స్ ను తీసుకొస్తున్నారట. ఇండియన్ సినిమాలో లానే కమల్ హాసన్ ఓల్డ్ గెటప్ లో కనిపిస్తారట. దీని కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ హెల్ప్ తీసుకోనున్నారట. కమల్ లుక్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కమల్ తో పాటుగా మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ విలన్ గా నటిస్తాడని తెలుస్తుంది. కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలు త్వరలో వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news