మెగా అల్లుడు సెకండ్ మూవీ

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విజేత అంతగా మెప్పించలేదు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ వాడుకున్నా సరే కళ్యాణ్ దేవ్ హిట్టు కొట్టలేదు. సినిమాలో కళ్యాణ్ దేవ్ నటనపై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే సెకండ్ మూవీకి కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ దేవ్ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు. పులి వాసు డైరక్షన్ లో మెగా అల్లుడి సెకండ్ మూవీ రాబోతుంది.

ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తో వచ్చిన కళ్యాణ్ దేవ్ లుక్ మాత్రం అదిరిపోయింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 2 నుండి కళ్యాణ్ దేవ్ సినిమా వస్తుంది. ఈ సినిమా కథ చిరంజీవి కూడా విన్నారట. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే కళ్యాణ్ ఓకే చేశాడని తెలుస్తుంది. మరి కళయాణ్ దేవ్ చేస్తున్న ఈ ద్వితీయ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.