2.ఓలో మరో సర్ ప్రైజ్

-

రజిని, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ సినిమా ఈ నెల 29న్ రాబోతుంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో రజినితో పాటుగా ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచగా కచ్చితంగా ఈ సినిమా ఓ అద్భుతాన్ని సృష్టిస్తుందని అంటున్నారు.

ఇక ఈ మూవీలో సర్ ప్రైజ్ థింగ్ ఏంటంటే రోబో సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఇందులో తళుక్కున మెరుస్తుందట. రోబో సినిమాలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ కు ఆమె క్రేజ్ కూడా యాడ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ సీక్వల్ కు ఐశ్వర్య క్రేజ్ వాడేస్తున్నాడు శంకర్.

ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 10వేల థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ కు ఇంకా 5 ఓజులే ఉండటంతో సినిమా రిలీజ్ కు అంతా సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2.ఓ ప్రభంజనం ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news