మారిన ప్రేక్షకుల ఆలోచన ధోరణితో సినిమా అది చిన్నదా పెద్దదా కాదు కంటెంట్ ఉన్న సినిమా అయితే స్టార్ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక చిన్న సినిమాలను ఆడియెన్స్ దగ్గరకు చేర్చే టీజర్, ట్రైలర్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈమధ్య కాలంలో టీజర్ తోనే చిన్న సినిమాల మీద ఓ క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు. అయితే జానర్ ను బట్టి ఆడియెన్స్ రెస్పాన్స్ వస్తుందనుకోండి.
లేటెస్ట్ గా బాలా బోడెపుడి చేస్తున్న ప్రయత్నంగా వస్తున్న సినిమా మంచు కురిసే వేళలో. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో, హీరోయిన్ ఇద్దరు కొత్తవాళ్లే. ఆర్జేగా పనిచేస్తున్న హీరో ఓ లవ్ స్టోరీ చెబుతాడు. అది ఫేక్ స్టోరీగా చెప్పినా అది అతని లైఫ్ స్టోరీ అని క్లైమాక్స్ లో తెలుస్తుంది. మొత్తానికి టీజర్ లవ్ ఫీల్ తో ఆహ్లాదకరంగానే ఉంది.
టీజర్ ఇంప్రెస్ చేసినా ఈ టీజర్ తో ఏమాత్రం ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలరో చూడాలి. సినిమా స్టోరీ తెలిసిపోతుంది. ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసేలా ఉంటే మాత్రం సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది. రామ్ కార్తిక్, ప్రణాలి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రవణ్ భరధ్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ మంచు కురిసే వేళలో ఈ శీతాకాలం ప్రేక్షకుల మెప్పు పొందుతుందో లేదో చూడాలి.