గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాన్ని దోచుకుని దాచుకున్న సొమ్ముని వడ్డీతో సహా కక్కిస్తానని తెరాస అధినేత కేసీఆర్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఏర్పాటుచేసిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీళ్లు, ప్రాజెక్టులు, సంక్షేమం కావాలని, ఆత్మహత్యలు నిర్మూలించాలని భావించి ఏ పార్టీతోనూ గొడవలు పెట్టుకోలేదన్నారు, కానీ ఇక ఊరుకునేది లేదు… తెలంగాణ పై కుట్రలు చేస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిని, కాంగ్రెస కుంభకోణాలను బయటపెట్టి వాళ్లు తిన్న సొమ్ము మొత్తాన్ని వడ్డీతో సహా కక్కించి, ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు. రోజోలిలోని సుంకేసుల బ్యారేజీ వద్దకు నేను వెళ్లిన నేపథ్యంలో కర్నూలులో బైరెడ్డి ఓ ప్రకటన ఇచ్చాడు.
కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తూములు మూస్తే.. ఆర్డీఎక్స్ పెట్టి పేల్చేస్తా అని నాకే వార్నింగ్ ఇస్తాడా… అయితే మాకు చేతులున్నాయి బైరెడ్డి. ఆర్డీఎస్ కాడ అడుగుపెట్టు, సుంకేసుల బ్యారేజీని వెయ్యి బాంబులు పెట్టి పేల్చేస్తానని నేనూ హెచ్చరించా.. దెబ్బకు సల్లబడ్డడు అంటూ తనదైన శైలిలో విమర్శించారు. కోటిమంది చంద్రబాబులు, 50 మంది పవన్‌కుమార్‌రెడ్డిలు వచ్చిన తెరాస ప్రభుత్వాన్ని, తెలంగాణ పురోగతిని ఎవ్వరూ అడ్డకోలేరన్నారు. మీ ప్రాంతానికి సేవ చేయాలని మీ ముందుకు వచ్చిన తెరాస అభ్యర్థిని ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డిన భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.