బెజవాడలో నకిలీ పోలీస్ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది.. స్టూడెంట్స్ టార్గెట్ గా చేసుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతోంది..గంజాయి సేవించే విద్యార్థులపై ఫోకస్ పెట్టింది ఈ నకిలీ పోలీస్ గ్యాంగ్..బెంగుళూరుకు చెందిన బీబీఏ విద్యార్థి యోగేంద్ర సాయి ఫిర్యాదుతో ముఠా ఆగడాలు వెలుగులోకొచ్చింది..గంజాయి సేవించే యోగేంద్రకి ఫోన్ చేసిన నకిలీ గ్యాంగ్..గంజాయి ఇవ్వాలంటూ ట్రాప్ చేసింది.. గంజాయి ఇచ్చే వ్యక్తిగా తమ వాడినే పంపి..మరో బ్యాచ్ పోలీస్ మాదిరిగా ఎంట్రీ ఇచ్చింది..బాధితుడి నుంచి 3లక్షలు డిమాండ్ చేసి చివరికి 50 వేలకు ఫైనల్ సెటిల్ మెంట్ చేసుకున్నారు..బెంగళూరు విద్యార్థి పిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ అలియాస్ డాని, లతీఫ్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు..అరెస్ట్ అయిన నిందితుల్లో దుర్గగుడి పాలక మండలిలో కీలక వ్యక్తికి సమీప బంధువు కుమారుడు, మరో నిందితుడు ఏఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు కూడా ఉన్నారు..యువకులు వాడిన బులెట్ బైక్ ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు..
బెజవాడలో నకిలీ పోలీస్ గ్యాంగ్ హల్ చల్..వారిని టార్గెట్ చేస్తు డబ్బులు వసూళ్లు.
-