భారత్‌లో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు..గత కొద్దీ రోజులుగా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి వైరస్ వ్యాప్తి మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తుంది..తాజాగా గడిచిన 24 గంటల్లో 48,268 కొత్త కేసులు నమోదయ్యాయి..దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల దిగువకు పడిపోయి..మొత్తం 5,82,649యాక్టివ్ కేసులు ఉన్నాయి..వరుసగా ఆరో రోజు కొత్త కేసులు 50వేల కన్నా తక్కువగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 551మరణాలు నమోదు అయ్యాయి..దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య లక్షా 21,641కి పెరిగింది..24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ 11,737 మంది డిశ్చార్జ్ అయ్యారు..ఇప్పటి వరకూ వివిధ ఆస్పత్రుల నుంచి 74,32,829 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.