కరోనాలో కూడా ఆ కంపెనీ కార్లు కేక…!

-

హ్యుందాయ్ మోటార్ ఇండియా అక్టోబర్‌ మొత్తం అమ్మకాలు 8.2 శాతం పెరిగాయి. 68,835 యూనిట్లను విక్రయించారు. కరోనా లేని సమయంలో అంటే గత ఏడాది… 2019 అక్టోబర్‌ లో కంపెనీ 63,610 యూనిట్లను విక్రయించింది. గత నెలలో అత్యధికంగా నెలవారీ దేశీయ అమ్మకాలు 56,605 గా నమోదు అయ్యాయి అని… 2019 అక్టోబర్‌లో 50,010 యూనిట్లతో పోలిస్తే 13.2 శాతం పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సంస్థ అంతకుముందు అత్యధిక నెలవారీ దేశీయ అమ్మకాల సంఖ్యను 2018 అక్టోబర్‌లో 52,001 యూనిట్లతో నిలిచింది. అక్టోబర్ నెల అమ్మకాల పనితీరు మొత్తం వ్యాపార వాతావరణానికి కాస్త సానుకూల అభిప్రాయం కల్పించింది అని కంపెనీ పేర్కొంది. వాటాదారులు ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే గత ఏడాది అక్టోబర్‌ లో 13,600 యూనిట్లతో పోలిస్తే కంపెనీ ఎగుమతులు 10.1 శాతం తగ్గి 12,230 యూనిట్లకు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news