బ్యాంకులకు కొత్త కష్టాలు..లక్షకోట్ల క్రెడిట్ కార్డు బకాయిలు…!

-

బ్యాంకులకు కొత్త కష్టాలొచ్చిపడ్డాయి. ఇప్పటికే మొండిబాకీలు వసూలు చేయలేక అష్టకష్టాలు పడుతున్న బ్యాంకులపై మరో భారం పడింది. క్రెడిట్‌ కార్డుల రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి. ఏకంగా లక్ష కోట్ల రూపాయలు బ్యాంకులకు పెనుభారంగా మారనుంది. చెల్లించని క్రెడిట్‌ కార్డుల బిల్లు ఏకంగా లక్ష కోట్లు ఉన్నట్లు ప్రకటించింది ఆర్‌బీఐ. ఇది బ్యాంకులకు ప్రమాదకర సంకేతమే అంటోంది ఆర్‌బీఐ.


కరోనా తెచ్చిన కష్టాల్లో కరెన్సీ కష్టాలే ఎక్కువ. కరోనా సోకితే.. 14 రోజులు క్వారంటైన్‌ ఉన్నా తగ్గిందేమో కానీ.. ఆర్థిక కష్టాలు మాత్రం ఏళ్లు గడిచినా తీరేలా లేవు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు ఊడి.. పనుల్లేక.. జీతాల్లో కోతలతో… ఉన్నోడు లేనోడు అనేతేడా లేకుండా అందరి ఖాతాలు ఖాళీ అయ్యాయి. దీంతో.. వేరేదారి లేక క్రెడిట్‌ కార్డులను ఎడాపెడా గోకేసారు జనాలు. సాధారణంగానే క్రెడిట్‌ కార్డు వాడకం ఎక్కువ. ఇక లాక్‌డౌన్‌ లో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో.. క్రెడిట్‌ కార్డు వాడకం మరింత రెట్టింపైంది.

అసలే మొండి బకాయిలతో కునారిల్లుతున్న బ్యాంకులపై ఇప్పుడు క్రెడిట్‌ కార్డు రుణాల భారం కూడా పడింది. భారీ ఎత్తున క్రెడిట్‌ కార్డు రుణాలు ముప్పులో పడ్డాయని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. ఈ మొత్తం దాదాపు లక్ష కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది ఆర్‌బీఐ. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కారణంగా ఉద్యోగాలు పోవడం, జీతాల్లో కోత వంటి కారణాలతో రుణ ఎగవేతలు పెరిగాయి. చాలా మంది హౌజింగ్‌, వెహికిల్‌ లోన్ల కంటే ముందు క్రెడిట్‌ కార్డుల చెల్లింపులను ఆపేస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన క్రెడిట్ కార్డ్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో మూడు శాతం ప్రతికూలత నమోదు చేసింది. క్రెడిట్ కార్డు రుణాలు లక్ష కోట్లుగా ఉన్నాయి. అయితే కరోనా మందగమనం కారణంగా భారత్‌లో మాత్రమే ఎక్కువ డిఫాల్ట్‌లు నమోదు కావడంకాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో డిఫాల్టులు పెరుగుతాయని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news