ఉపాధ్యాయ పోస్టుల అర్హత కోసం నిర్వహించే పరీక్ష సీటెట్ తేదీలను హెచ్‌ఆర్‌డీ ప్రకటించింది. కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్)ను 2021 జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. సామాజిక దూరం, రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను 112 నుంచి 135కు పెంచారు.
పరీక్ష కేంద్రాల మార్పుకు అవకాశం
కొవిడ్‌తో విద్యార్థులు పట్టణాలు వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాలు మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల మార్చుకోవాలనుకునే వారు నవంబరు 11 నుంచి 16వ తేదీ వరకు
http://www.ctet.nic.in/ వెబ్సైట్లో మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.