తెలంగాణాలో పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంటు ని క్రియేట్ చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లా పోలీసులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిందితులను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి.
బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని 8 వేలు పంపాలని మెసేజ్ లు పెట్టాడు. ఫేక్ అకౌంట్ విషయం పై తన అసలు ఖాతాలో జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసారు. తన పేరుతో ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వొద్దని సూచనలు చేసారు. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు కలెక్టర్ నారాయణరెడ్డి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసారు.