కశ్మీర్ లో టెన్షన్:మూడు సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులు…!

-

జమ్మూకశ్మీరు సరిహద్దుల్లోని మూడు సెక్టార్లలో పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది.పూంచ్ జిల్లా షాహపూర్, కిర్నీ, కసబా సెక్టార్లలో పాక్ షెల్లింగులతో కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు.

కథువా జిల్లా హీరానగర్ సెక్టారులోని సరిహద్దు అవుట్ పోస్టు, సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని అంతర్జాతీయ సరిహద్దు వద్ద నిన్న అర్దరాత్రి పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది.పాక్ కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పికొట్టారు. అక్టోబరు 1వతేదీన ఫూంచ్ జిల్లాలో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యారు.రాజౌరీలోని సుందర్ బనీ వద్ద పాక్ గతంలో కాల్పులు జరిపింది. ఈ ఏడాది పాక్ సైనికులు 3,589 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపారు. సెప్టెంబరులోనే అత్యధికంగా 427 సార్లు కాల్పులు జరిపారు.

Read more RELATED
Recommended to you

Latest news