దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు అన్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ఎంతోమంది సినీ రాజకీయ క్రీడ రంగ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవలే భారత జట్టు మాజీ ఓపెనర్ ఎంపీ గౌతం గంభీర్ కుటుంబాన్ని కూడా కరోనా కదిలించింది.
ఇటీవలే తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంతున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు గౌతమ్ గంభీర్. తన ఇంట్లో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది అని అందుకే నిబంధనల ప్రకారం సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను అంటూ తెలిపారు. ఇక తాను కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్నానని ఆ రిపోర్టుల కోసం వేచి చూస్తున్నాను అంటూ గౌతం గంభీర్ తెలిపాడు. కరోనా వైరస్ ను తేలికగా తీసుకోవద్దు అని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.