ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కోహ్లీ, పుజారా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. మొదలగు బ్యాట్స్ మెన్ లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రపంచ మేటి బౌలర్లందరూ భారత బ్యాటింగ్ లైనప్ ని పడగొట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంటారు. ఐతే ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ లైనప్ కంటే ఇంతకుముందు ఉన్న బ్యాటింగ్ లైనప్ బాగుందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ అభిప్రాయపడుతున్నాడు.
సచిన్ టెండూలర్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఇంకా లక్ష్మణ్ మొదలగు వారితో పోల్చి చూస్తే ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ పెద్ద బలంగా ఏమీ లేదని తెలిపాడు. పాకిస్తాన్ జట్టుకి ఆడుతున్నప్పుడు దిగ్గజ ఆటగాళ్ళైన బ్రియల్ లారా, పాంటింగ్, హేడెన్ లాంటి క్రికెటర్లు అత్యుత్తమంగా ఆడేవారని, కానీ అందరికంటే అత్యుత్తమ ప్రదర్శన సచిన్ టెండూల్కర్ ఇచ్చేవాడని, అందుకే సచిన్ కంప్లీట్ బ్యాట్స్ మెన్ గా అనిపించేవాడని అన్నాడు.