అమెరికా అధ్యక్షుడిగా ఓటమి పాలైన ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా రోజులకు మీడియాతో కాస్త స్వేచ్చగా మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ… బిడెన్ అమెరికాను కరోనా లాక్డౌన్ లో పెట్టవద్దని పట్టుబట్టారు. జనవరిలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తే మాత్రం లాక్ డౌన్ వద్దు అన్నాడు. పరోక్షంగా జో బిడెన్ గెలిచిన విషయాన్ని ట్రంప్ అంగీకరించారు.

నేను అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు కూడా లాక్ డౌన్ కి అమెరికాను తీసుకుని వెళ్ళే ప్రశ్నే లేదు అని ఆయన స్పష్టం చేసారు. భవిష్యత్తు పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలుసు…? కాలమే సమాధానం చెప్తుంది. కాని అమెరికా మాత్రం లాక్ డౌన్ లోకి వద్దు అని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అయితే ఓటమిని మాత్రం ఆయన డైరెక్ట్ గా అంగీకరించలేదు.