తెలంగాణ ఎన్నిల ప్రచార గడువు దగ్గర పడుతున్న సందర్భంగా జాతీయ స్థాయి నాయకులు సైతం తెలంగాణకు దారి పడుతున్నారు. దీంతో తెలంగాణ భాజపా సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీ అధ్యక్షతన భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. దీంతో మోదీ సభను విజయవంతం చేయడంతో పాటు భాజపా ప్రభంజనాన్ని తెలంగాణ ఎన్నికల్లో చాటనున్నారు. హైదరాబాద్, పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోలో భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయలు పరిశీలిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రస్తుతమున్న ఐదుగురు ఎమ్మెల్యేలు సభను సక్సెస్ చేయడం కోసం వ్యూహరచన చేస్తున్నారు.
ఇప్పటికే యోగి ఆధిత్యానాథ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై చేసిన వ్యాఖ్యలకు ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనికి గాను అసదుద్దీన్ యోగి ఆదిత్యనాథ్ కి గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రత చర్యలు తీసుకున్నారు.