పొగకు ఊపిరాడక.. నలుగురు పిల్లలు మృతి..!

-

ధూమపానం వల్ల నలుగురు పిల్లలు మృతి చెందిన ఘటన ఇంగ్లండ్‌లోని స్టఫోర్డ్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు నటాలియా యునిట్, తండ్రి క్రిస్టఫర్‌ మౌల్టెన్‌ నిర్లక్ష్యం కారణంగా వారి నలుగురు పిల్లలు అగ్నికి ఆహుతై మరణించారు. రిలే హోల్ట్‌కు 8 ఏళ్లు, కీగన్‌ యునిట్‌కు ఆరేళ్లు, టిల్లీ రోజ్‌ యునిట్‌కు నాలుగేళ్లు, ఒల్లి యునిట్‌కు మూడేళ్లు. తల్లిదండ్రులు ఉండే మాస్టర్ బెడ్ రూమ్ లో మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన భార్యాభర్తలు తప్పించుకుని వారిని వారు రక్షించుకుని బయట పడ్డారు. కానీ, అభం శుభం తెలియని పిల్లలు మరిచారు.

dead
dead

అగ్నిమాపక దళం ఇంటికి వెళ్లి మంటలు ఆర్పే సమయానికి ఇంట్లోని మాస్టర్ బెడ్ రూమ్ లో ఎక్కడపడితే అక్కడే తాగేసిన సిగరెట్‌ పీకలు కనిపించాయి. ఒక యాష్ ట్రే మంటలకు పూర్తిగా దగ్ధం కాగా, మరో యాష్‌ ట్రే సిగరేట్‌ పీకలతో అలాగే నిండుగా ఉంది. ఇంటిలోని వంట గదికి అవతల కొన్ని వందల సిగరెట్‌ పీకలు కనిపించాయి. ఇవన్నీ గమనించిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం కేవలం భార్యాభర్తల నిర్లక్ష్యం వల్తే జరిగిందని భావించి దీని పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గతేడాదిలో జరిగిన ఈ ఘటన పై గురువారం సౌత్‌ స్టఫోర్డ్‌షైర్‌ కొరోనర్స్‌ కోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిగింది. దీనిపై ఐదుగురిని విచారించగా.. వారు అసలు కారణాన్ని వివరించలేకపోయారు. సిగరేట్లు ఇంటి మొత్తాన్ని దగ్ధం చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లోని ఓ కిటికీ అద్దం చెక్కు చెదరకుండా ఉండటం చూస్తుంటే ఇంకేవో మంటలను ప్రేరేపించి ఉంటాయని ఫైర్‌ ఇన్వెస్టిగేటర్‌ లీగ్‌ రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. పెరట్లో ఉన్న బాయిలర్ కారణంగా వ్యాపించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యమా.. లేక పిల్లలకు తెలియనితనమా.. ఇతర కారణాలేవైనా ఉన్నాయా.. అనేది నిర్ధారించలేకపోయారు. విచారణ అనంతరం తల్లిదండ్రులను బెయిల్ మీద విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news