ఎన్నికలొచ్చిన ప్రతీ సారి లగడపాటి సర్వే పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వివరాలు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ సర్వే బృందం 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో మాత్రమే సర్వే చేయగలిగిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 1200 నుంచి 2వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు.
తెరాస కంటే ప్రజాకూటమినే ఎక్కువ జిల్లాల్లో ఆధిక్యంలో ఉందన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రజాకూటమి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పోలింగ్ శాతం తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
హైదరాబాద్‌లో అత్యధిక సీట్లు ఎంఐఎం
వరంగల్, నిజామాబాద్, మెదక్‌లో టీఆర్ఎస్;
ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి
కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో హోరాహోరీ
గతంలో కంటే ఈ సారి భాజపా తన ఓటు బ్యాంకుతో పాటు సీట్ల సంఖ్యను సైతం పెంచుకోనుందన్నారు.