జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల పరిశీలన కూడా ముగిసింది. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు బరిలో నిలిచే వారి జాబితాను ఎన్నకల సంఘం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల హడావుడి మొదలైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయగా, ఇవ్వాల మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్ విడుదల చేయనున్నారు.
మ్యానిఫెస్టోతో టీఆర్ఎస్ వైఫల్యాలపై చార్జిషీట్ ను గ్రేటర్ ప్రజల ముందుంచనున్నారు. దీంతో బీజేపీ మ్యానిఫెస్టోలో ఎం ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే వరదసాయంపై ఆ పార్టీ ప్రకటన చేసింది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.25వేలు అందజేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. దీంతోపాటు ట్రాఫిక్ చలాన్లు ఎత్తేస్తామని ప్రకటించారు. ఇంకా ఎం ఉండబోతున్నాయని నగర ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కాగా, బీజేపీ విడుదల చేయనున్న చార్జిషీట్‌పై టీఆర్ ఎస్ నేతల ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.