బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందా? నిజమేంటి?

-

గర్భం దాల్చగానే తినే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని ఆహారాలు గర్భ దాలిన మహిళలకి పనికొస్తాయని అనుకోవద్దు. పిండదశలో ఉన్నప్పటి నుండి బిడ్డ జన్మించే వరకూ ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా పిండదశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య చాలా మంది మహిళలకి గర్భస్రావం అవుతుంది. దానికి చాలా కారణాలు ఉండవచ్చు.

అలాంటి కొన్ని కారణాలు మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే డాక్టరుకి సంప్రదించి సరైన ఆహారం తీసుకోవాలి. ఏది పడితే అది తినకుండా ఉండడం బెటర్. ఐతే చాలామందికి ఒక సందేహం ఉంది. బొప్పాయి తినడం వల్ల గర్భ స్రావం కలుగుతుంది అని. ఈ విషయమై సినిమాల్లో కూడా చాలా ఉదాహరణలు వచ్చాయి. చాలామందిలో ఉన్న ఈ అభిప్రాయం నిజంగా నిజమా కాదా ఈ రోజు తెలుసుకుందాం.

బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరగడం నిజమే.. కానీ అది పండని బొప్పాయి తినడం వల్ల జరుగుతుంది. పండుగా మారని బొప్పాయిని గర్భవతులు తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. దీనికి గల ముఖ్య కారణం అందులో పెపైన్ అనే పదార్థమే. పండని బొప్పాయిలో పెపైన్ ఉంటుంది. బొప్పాయి పండుగా మారిన తర్వాత పెపైన్ పదార్థం ఉండదు. అందువల్ల పండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల గర్భస్రావం జరగదు.

పండని బొప్పాయి తింటే ప్రమాదం ఉంటుంది. పండుకి, కాయకి ఇంత తేడా ఉంది. కాయగా ఉన్న బొప్పాయి పిండాన్ని విఛ్ఛిన్నం చేస్తుంది. పండిన బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే అని సింగపూర్ పరిశోధకులు నిరూపించారు. ఇదంతా ఎందుకు అసలు బొప్పాయి తినకపోవడమే మంచిది అని చాలా మంది అనుకుంటారు. అలా అనుకున్న ఫర్వాలేదు గానీ పండిన బొప్పాయి తిన్నా కూడా అనుమానాలు ఉంటే వాటిని విస్మరించి హాయిగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news