సమాధానం చెప్పిన తరువాతే ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ వెళ్ళాలి !

-

గ్రేటర్ ఎన్నికల కోలాహలం మొదలైంది. నేతలు ఒకరి మీద ఒకరు, ఒకరి పార్టీ మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీజేపీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వ లోపం వల్ల నాయకులను తయారు చేసుకోలేక, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ బీజేపీలో చేరాలని కాళ్ళ మీద పడుతున్నారని అన్నారు. జనసేనతో పొత్తు లేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తే, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బండి సంజయ్ కి సమాచారం లేకుండా పవన్ కళ్యాణ్ మద్దతు ఆడిగారా…? ఆయన ప్రశ్నించారు. మత ప్రాతిపదికాన ,అభివృద్ధి అని ప్రశ్నించే గొంతుకనని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. కేసీఆర్ మీద చార్జిషీట్ రిలీజ్ చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వచ్చారని నేను ప్రకాష్ జవదేకర్ మీద చార్జిషీట్ విడుదల చేస్తున్న దీనిమీద సమాధానం చెప్పిన తర్వాతనే ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ వెళ్లాలని రేవంత్ రెడ్డి అన్నారు.

revanth_reddy
revanth_reddy

1.మై హోమ్ అక్రమ సిమెంట్ వ్యాపారం చేస్తుంది..పర్యావరణ అనుమతులు ,అటవీ అనుమతులు లేవని వేల కోట్లు నష్టపోతున్నామని నాతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. దాని మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రకాష్ జవదేకర్ మై హోమ్ రామేశ్వర రావు కి అండగా ఉన్నారు. మీ పార్లమెంట్ సభ్యుడు ఆధారాలతో చేసిన ఫిర్యాదు పై ఎందుకు చర్యలు తీసుకోలేదు..?

2.శ్రీశైలం ,కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..?

3.మూసి నది ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని నాతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసాం… ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటే ఇవాళ ఇంత వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడకపోతుండే దీనికి కారణం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్..

4.హైదరాబాద్ చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల అక్కడ ఉన్న 30 గ్రామాలు పూర్తిగా కాలుష్యం అవుతున్నాయని NGTకి వెళ్ళా… కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తే మంత్రి కేటీఆర్ కి సన్నిహితులు అక్రమంగా దోచేశారని ప్రకాష్ జవదేకర్ కి ఫిర్యాదు చేసా అయిన చర్యలు తీసుకోలేదు…

5.హుస్సేన్ సాగర్  పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు తీర్పు ఉందని అక్కడ సెక్రటేరియట్ వద్దని ప్రకాష్ జవదేకర్ కి ఫిర్యాదు చేశా…

6.111 జీవో గండిపేట చెరువు పరిసరాల్లో ఎలాంటి నిర్మాణాలు చెపట్టవద్దు..

అక్కడ కేటీఆర్ 25 ఎకరాల అక్రమ ఫార్మ్ హౌస్ ,రామేశ్వర్ రావు 30 ఎకరాల్లో 30 అంతస్థుల 3వేల అక్రమ నిర్మాణం చేపట్టారు..ఈ అక్రమ నిర్మాణాలపై ప్రకాష్ జవదేకర్ కి పిర్యాదు చేసాను. ఇలా తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ కాలుష్యం చేస్తున్నారని ఎన్నో లేఖలు రాసా దేని పైన అయినా చర్యలు తీసుకున్నారా…? అనేది సమాధానం చెప్పి ఆ తర్వాత ఢిల్లీ వెళ్లాలని రేవంత్ రెడ్డి అన్నారు. 

 

 

 

 

  

Read more RELATED
Recommended to you

Latest news