ఐపీఎల్ బెట్టింగ్ వ్య‌వ‌హారంలో మ‌రో ఎస్సై అరెస్టు!

-

కామారెడ్డి జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ వ్య‌వ‌హారం పోలీసులు అధికారుల మెడ‌కు చుట్టుకుంటున్న‌ది. లంచావ తారుల‌పై సీరియ‌స్‌గా ఉన్న‌ ఏసీబీ అధికారులు మ‌రింత కూపీ లాగుతున్నారు. దీంతో ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో తొలుత కామారెడ్డి సీఐ జగదీష్ అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. బెయిల్ విష‌యంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి రూ.ఐదు లక్షలు డీల్ కుదుర్చుకొని రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఈ నెల 20న సీఐ జగదీష్ ను అరెస్ట్ చేశారు. ఇదే వ్యవహారంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను సైతం రెండు రోజులపాటు విచారించి వదిలేశారు.

ఇక తాజాగా నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్న ఎస్సై గోవిందుని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఈ అవినీతి మ‌కిలీలో మరికొందరు పోలీసుల పాత్ర ఉన్నట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్, మరో ఎస్ఐ తమ ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఏసీబీ విచారణ సహకరించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఏసీబీ కి చిక్కిన సీఐ జగదీష్ బ్యాంకు లాకర్లను ఇప్పటికే ఓపెన్ చేయగా సుమారుగా అరకోటి విలువ చేసే బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు ప‌ట్టుబ‌డ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news