హడావుడిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ కు వెళ్లారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఏ పార్టీ నుంచి రంగంలోకి దించాలని అనే విషయం పై క్లారిటీ తెచ్చుకునేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినట్టు ప్రచారం జరుగుతున్నా, అనేక అంశాలపై ఆయన ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. ఆయనకు వెంటనే ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఏపీలో పవన్ ను బిజెపి అగ్రనేతలు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కలిసి పవన్ అనేక అంశాలపై చర్చించారు. సుమారు గంటసేపు జరిగిన చర్చల్లో తిరుపతి ఉప ఎన్నిక అంశం పైన ఇతర అంశాల పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జనసేన కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే విషయంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని రంగంలోకి దించుతామని అనేకమార్లు బిజెపి ప్రకటించింది. దీంతో జనసెన ఆగ్రహం వ్యక్తం చేయడం, తమ పార్టీకి పట్టు ఉన్న చోట తమకు అవకాశం కల్పించకుండా, బిజెపి ఎలా పోటీ చేస్తుందని ప్రశ్న జనసేన వర్గాలు వ్యక్తం చేశాయి.దీనిపై పవన్ క్లారిటీ తెచ్చుకునేందుకు ఢిల్లీ వెళ్లగా, ఇక్కడ అనేక అంశాలపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు సమాచారం.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి వ్యవహారంపై జనసేన కోరిన డిమాండ్లను తీర్చేందుకు బిజెపి ఒప్పుకున్నట్లు జనసేన ప్రయత్నించింది. అలాగే పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి బిజెపి దూకుడు గా వెళ్ళకుండా, రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి . అభ్యర్థిని నిలబెట్టే విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలనే అంశంపైనా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే బిజెపి తిరుపతి ఎన్నికల విషయంలో దూకుడుగా వెళ్ళకుండా పవన్ చక్రం తిప్పినట్టుగా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.