‘పుష్పా’ లో విలన్ ఒక్కరు కాదా అంతమందా..!?

-

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు వచ్చాయంటే చాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఎందుకంటే సాధారణంగా ఏ సినిమాలో అయినా లవర్ బాయ్ లాగా కనిపించే అల్లు అర్జున్ మొదటి సారి ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంటే కాకుండా ఈ సినిమాను బన్నీకి లక్కీ దర్శకుడైన కాలిక్యులేటర్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా లో అల్లు అర్జున్ పాత్ర ఒక రేంజ్ లో ఉండబోతుంది అని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో ఏకంగా 9 విలన్లు నటించబోతున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది అయితే ఇటీవలే కలర్ ఫోటో సినిమాతో విలన్ గా తనలోని నటుడిని ప్రూవ్ చేసుకున్న సునీల్ కూడా ఈ సినిమాలో ఒక విలన్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news