దారుణం : నలభై మంది రైతులను పొలంలోనే గొంతు కోసి చంపారు  

-

ఆఫ్రికా దేశం అయిన నైజీరియాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన 43 మంది రైతులను బోకో హరమ్ గ్రూప్ కు చెందిన మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపారు. అదే చోటకు పనికి వెళ్ళిన ఇంకా కొంత మంది రైతుల ఆచూకీ తెలియ కుండా పోయింది. ఈశాన్య నైజీరియాలో వరి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన బోర్నో కమ్యూనిటీ అయిన గారిన్ క్వాషి బేలోని వరి పొలంలో శనివారం ఈ దాడి జరిగింది. స్థానిక ప్రభుత్వ మండలిని ఎన్నుకోవటానికి ఆ రాష్ట్ర నివాసితులు 13 సంవత్సరాలలో మొదటిసారి ఓట్లు వేస్తున్నారు.

అయినప్పటికీ చాలామంది వారి ఓట్లు వేయడానికి వెళ్ళలేదు. సాయుధ తిరుగుబాటుదారులు అందరూ ఈ రైతులను చుట్టుముట్టి వారిని గొంతు కోసి చంపారు. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అమానుష ఘటనగా ఆయన అభివర్ణించారు. చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. అయితే అసలు వారిని ఎందుకు చంపారు, దానికి కారణం ఏమిటి అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news