యుఎస్ కాంగ్రెస్ కమిషన్ భారత్ కు కీలక వార్నింగ్ ఇచ్చింది. జూన్ లో జరిగిన గాల్వన్ వ్యాలీ ఘటన తరహా ఘటనను చైనా ప్రభుత్వం మళ్ళీ ప్లాన్ చేసింది అని భారత సైనికులు మరణించే అవకాశం ఉంది అని వెల్లడించింది. దాదాపు అర్ధ శతాబ్దంలో చైనా-ఇండియా సరిహద్దులో జరిగిన మొదటి ఘోరమైన ఘర్షణ ఇది. ఈ ఘటనకు బీజింగ్ కారణం అని అమెరికా పేర్కొంది.
పాలక చైనా కమ్యూనిస్ట్ పార్టీ శాంతియుతంగా ఉన్న సమయంలో తన సాయుధ దళాలను దాడులకు వాడుకునే ఆలోచన చేస్తుంది అని అమెరికా పేర్కొన్నారు. తైవాన్ చుట్టూ మరియు దక్షిణ చైనా సముద్రంలో పెద్ద ఎత్తున బెదిరింపు కార్యక్రమాలు చేస్తుంది అని యుఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన తాజా వార్షిక నివేదికలో కాంగ్రెస్ కు తెలిపింది. భారత్ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది